»Telangana Hyderabad Devotee Donated Three Golden Crowns To Yadadri Temple
Yadadri స్వర్ణమయం.. 3 బంగారు కిరీటాలు ఇచ్చిన భక్తుడు
ఆలయంలోని ముఖ మండపంలో నిత్యం సువర్ణ పుష్పార్చన జరిగే యజ్ణమూర్తులైన స్వామి, అమ్మవార్లకు ఆ కిరీటాలు అలంకరించనున్నారు. కానుకలకు ఆలయంలో ప్రధాన పూజారులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య, కాంటూరి వెంకటాచార్య ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ (Telangana) ఇలవేల్పుగా ఉన్న యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy Temple) ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి (Summer) కాలం కావడం.. వరుస సెలవులు ఉండడంతో రాష్ట్రం నలుమూలలా నుంచి భక్తులు తరలివస్తున్నారు. తిరుమల స్థాయిలో యాదాద్రి ప్రాశస్త్యం పొందుతోంది. కాగా ఆలయానికి భారీగా కానుకలు, హుండీ ఆదాయం దక్కుతోంది. యాదాద్రీశుడికి భక్తులు తమకు తోచిన స్థాయిలో కానుకలు విరివిగా అందిస్తున్నారు. తాజాగా ఓ భక్తుడు స్వామి అమ్మవార్లకు మూడు స్వర్ణ కిరీటాలు అందించారు. వాటి విలువ రూ.30 లక్షలు ఉంటుంది.
హైదరాబాద్ లోని చంపాపేట కు చెందిన మాచమోని ప్రకాశ్ ముదిరాజ్ కుటుంబసభ్యులు గురువారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ఈవో గీతారెడ్డికి మూడు కిరీటాలు అందించారు. నరసింహ స్వామి, లక్ష్మీ, భూదేవిలకు రూ.30 లక్షలు విలువ చేసే 429 గ్రాముల బంగారంతో ఆ కిరీటాలు తయారు చేశారు. దీంతోపాటు 520 గ్రాముల వెండి పల్లెం కూడా బహూకరించారు. ఈ కిరీటాలు ఆలయంలోని ముఖ మండపంలో నిత్యం సువర్ణ పుష్పార్చన జరిగే యజ్ణమూర్తులైన స్వామి, అమ్మవార్లకు ఆ కిరీటాలు అలంకరించనున్నారు. కానుకలకు ఆలయంలో ప్రధాన పూజారులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్య, కాంటూరి వెంకటాచార్య ప్రత్యేక పూజలు చేశారు. దాతలకు ఆలయ పాలక మండలి ఘనంగా సన్మానించింది.