దేశంలోనే అతిపెద్ద నది.. అతి పవిత్రంగా భావించే గంగా నది (Ganga River). హిమాలయాల (Himalays) నుంచి పారే ఈ నది చుట్టూ మన దేశ సంస్కృతి విలసిల్లింది. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో సుదూర దూరం పారే ఈ నది పశ్చిమ బెంగాల్ (West Bengal)లో బంగాళాఖాతంలో (Bay of Bengal) కలిసిపోతుంది. అనేక పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఉన్న ఈ నదికి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలు (Pushkar) త్వరలో జరుగనున్నాయి. ఈ పుష్కరాలకు సంబంధించి తేదీలు (Schedule) ఖరారయ్యాయి. ఎన్ని రోజులు.. ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసుకోండి.
నదులను పవిత్రంగా భావించే హిందూ ప్రజలు గంగా నది పుష్కరాలు అంటే వారికి అత్యంత పవిత్రం. గంగా నదిని గంగమ్మ తల్లి, పావన గంగ, గంగా భవానీగా పూజిస్తుంటారు. అంతటి ప్రాశస్త్యమైన ఈ నది పుష్కరాలు ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమయ్యే గంగా నది పుష్కరాలు బృహస్పతి మళ్లీ మీనా రాశీలోకి ప్రవేశించేటప్పుడు ముగుస్తాయి. అంటే మే 3వ తేదీన 12 రోజుల పాటు పుష్కర మహోత్సవం జరుగనుంది.
పన్నెండు ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల కోసం గంగానది ప్రవహించే ప్రాంతాలు ముస్తాబవుతున్నాయి. నది తీర ప్రాంతాలైన గంగోత్రి (Gangotri), గంగా సాగర్, హరిద్వార్ (Haridwar), బద్రీనాథ్ (Badrinath), కేదారనాథ్ (Kedaranath), వారణాసి, అలహాబాద్ లో భారీ ఏర్పాట్లు జరుగనున్నాయి. ఈ పుష్కరాల కోసం దేశంలోని అన్ని మూలాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు (Pilgrims) తరలిరానున్నారు. కోట్లాది మంది ప్రజలు ఈ పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానాలు (Bath) ఆచరించనున్నారు. ఇక పితృమూర్తులకు పిండ ప్రదానం కూడా చేయనున్నారు. పుష్కరాల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే పుష్కరాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
పుష్కరం అంటే..
– బృహస్పతి (Jupiter) ప్రతి సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. మొత్తం 12 రాశుల్లో ఒక్కో ఏడాది ఒక్కో రాశిలో ప్రవేశిస్తుంటాడు. ఆయా రాశుల్లో చేరిన తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పేర్కొంటారు.
– ఈ పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలు పుష్కరునితో కలిసి నదీజలాల్లో ప్రవేశిస్తారు అనే నమ్మకం ఉంది.
– బ్రహ్మాది దేవతలు పుష్కరునితో కలిసి ప్రవేశించిన నదీజలాల్లో స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని భావిస్తారు.
– ఈ పుష్కర సమయంలో పిండ ప్రదానం ప్రధానమైనది. పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు పుణ్యలోకాలు పొందుతారని పండితులు చెబుతారు.