»Varanasi Shock For The Comedian Contesting Against The Prime Minister
Varanasi: ప్రధానిపై పోటీ చేస్తున్న కమెడియన్‌కు షాక్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా మోదీకి పోటీగా నామినేషన్ వేశారు. కానీ అతని నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.
Varanasi: Shock for the comedian contesting against the Prime Minister
Varanasi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా మోదీకి పోటీగా నామినేషన్ వేశారు. అయితే అతని నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే నామినేషన్ పత్రాలు తిరస్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ రంగీలా ప్రధాని మోదీ, రాహుల్ గొంతులతో మిమిక్రీ చేసి పాపులర్ అయ్యారు.
నామినేషన్ వేసే సమయంలో శ్యామ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొకున్నారని ఆరోపించారు. మే 10, 13వ తేదీల్లో నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా.. తన పత్రాలను ఎవరూ తీసుకోలేదన్నారు. చివర రోజు నామినేషన్ వేయడానికి వెళ్లగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని శ్యామ్ తెలిపారు. ఎన్నో ప్రయత్నాలు తర్వాత చివరకు గడువుకు రెండు నిమిషాల ముందు నామినేషన్ వేశారు. కానీ మరుసటి రోజు ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి పత్రాలను తిరస్కరించారు. నామినేషన్ పూర్తిగా లేదని, అఫిడవిట్‌పై ప్రమాణం చేయలేదని కావాలనే తిరస్కరించారని అధికారులపై శ్యామ్ మండిపడ్డారు.