KNR: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదరి శోభారాణి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శోభారాణి తన ప్రత్యర్థి ఎల్కతుర్తి కనకలక్ష్మిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.