»These People Get Negative Effect After Eating Cucumber
Cucumber: వేసవి వరం.. కానీ కొందరికి శాపం
కీరదోస ఒక సాధారణ కూరగాయ అయినప్పటికీ, ఇది ఎండాకాలంలో చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే, కొందరికి కీరదోస మంచిది కాదు. అది ఎవరికో తెలుసా..?
Syed Mustafa Kamal: If India is stepping on the moon, Pakistan is near a dirty canal
కీరదోస ఎవరు తినకూడదు?
మూత్రపిండ సమస్యలు ఉన్నవారు: కీరదోసలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇది మూత్రపిండ సమస్యలు ఉన్నవారికి హానికరం కావచ్చు. అసిడిటీ ఉన్నవారు: కీరదోసలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అసిడిటీని మరింత పెంచుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు:కీరదోస జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బంది కలిగిస్తుంది. జలుబు, దగ్గు ఉన్నవారు:కీరదోసలోని శీతల లక్షణాలు జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలను మరింత పెంచుతాయి.
అలెర్జీలు ఉన్నవారు:కీరదోసకు కొంతమందికి అలెర్జీ ఉండవచ్చు. చర్మం దద్దుర్లు, దురద, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చలికాలం, వర్షాకాలంలో:ఆయుర్వేదం ప్రకారం, ఈ కాలాల్లో కీరదోస తినడం వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి. రాత్రిపూట: రాత్రిపూట కీరదోస తినడం వల్ల జీర్ణ సమస్యలు, నిద్రలేమి రావచ్చు. అధిక మోతాదులో:ఎండాకాలంలో అయినా కీరదోసను అధిక మోతాదులో తినకూడదు. డీహైడ్రేషన్, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు:గర్భిణీ స్త్రీలు, పిల్లలు కీరదోస తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.