»Syed Mustafa Kamal If India Is Stepping On The Moon Pakistan Is Near A Dirty Canal
Syed Mustafa Kamal: భారత్ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్ మాత్రం మురికి కాలువ దగ్గర ఉంది
దేశంలోని పరిస్థితులను పాకిస్థాన్ నేతలు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. భారత్ సాధించిన అభివృద్ధి, సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ భారత్ సాధించిన గొప్పతనాలను పార్లమెంట్ సభలో వివరించారు.
Syed Mustafa Kamal: If India is stepping on the moon, Pakistan is near a dirty canal
Syed Mustafa Kamal: ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంది. దేశంలోని పరిస్థితులను పాకిస్థాన్ నేతలు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. భారత్ సాధించిన అభివృద్ధి, సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ భారత్ సాధించిన గొప్పతనాలను పార్లమెంట్ సభలో వివరించారు. టీవీలో చంద్రుడిపై భారత్ కాలుమోపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దానికి కొన్ని సెకన్ల సమయం తర్వాత టీవీలో పాకిస్థాన్ న్యూస్ వచ్చింది.
కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన న్యూస్ వచ్చింది. కాలువలో పడిన పిల్లలను కాపాడలేని పరిస్థితిలో పాకిస్థాన్ ఉంది. పాక్కు కరాచీ ప్ర్రధాన ఆదాయ వనరు. రెండు నౌకాశ్రయాలు ఇక్కడ ఉన్నాయి. కానీ 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. ఉన్న కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు స్కూల్కు వెళ్లడం లేదు. పాక్ ఎంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని సయ్యద్ ముస్తఫా అన్నారు.