NZB: బోధన్ మండలం సంగం మినార్పల్లికి చెందిన రోడ్డ సుచరితకు రాజకీయ శాస్త్రంలో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు లభించింది. డా.వి. శ్రీలత పర్యవేక్షణలో మహిళా సాధికారతపై నిజామాబాద్ జిల్లా అధ్యయనానికి ఈ గౌరవం దక్కింది. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి తల్లి అంజలి సహా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సాధించారు.