పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం రంగంపల్లిలో నిర్మిస్తున్న కొత్త వీ- హబ్ భవనాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఏసీలు, తదితర పెండింగ్ పనులు 3 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. కాగా, మహిళలకు పారిశ్రామిక శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ భవనం ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.