KMM: మధిర మండలం కాజీపురం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలోని అయేషా (17) అనే బాలిక మృతి చెందగా, మరో 6 మందికి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.