»Telangana Kt Rama Rao Called To Maha Dharna In Singareni Region While Modi Visit
Singareni మోదీ పర్యటన రోజే ధర్నాకు దిగనున్న KTR
తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా అడుగు పెడతాడని ప్రశ్నిస్తోంది. గతంలో మాదిరే మరోసారి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
ఇచ్చిన హామీలు (Promises) నెరవేర్చకపోవడం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు (Funds) విడుదల చేయకపోవడం.. ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్ సిఫారసులకు ఆమోదం తెలపకపోవడం.. తెలంగాణ (Telangana) అభివృద్ధిని అడ్డుకోవడం వంటి వాటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi- BRS Party) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నరేంద్ర మోదీ (Narendra Modi) రాష్ట్రానికి శనిలా దాపురించాడని తీవ్రంగా మండిపడుతోంది. తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా అడుగు పెడతాడని ప్రశ్నిస్తోంది. గతంలో మాదిరే మరోసారి ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ (BRS Party) భావిస్తున్నది. ఈ నేపథ్యంలో భారీ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KT Rama Rao) పిలుపునిచ్చాడు.
తెలంగాణ సిరులగని సింగరేణి సంస్థను (Singareni Collieries Company Limited- SCCL) పూర్తిగా ప్రైవేటుకరించాలనే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా సింగరేణిలోని బొగ్గు గనులను (Coal Mines) కేంద్రం వేలం వేయాలని మరోసారి నిర్ణయించడంపై మండిపడ్డారు. ఇదే అంశంపై ప్రధాని పర్యటన వేళ కేటీఆర్ అస్త్రంగా చేసుకున్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ భారీ స్థాయిలో ఉద్యమం చేయనుంది. సింగరేణి పరిధిలోని మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలకు కేటీఆర్ పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా సింగరేణి ప్రాంత పరిధిలోని బీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు.
అనంతరం ఈ మూడు చోట్ల జరిగే ధర్నాలో ఎక్కడో ఒక చోట కేటీఆర్ (KTR) ప్రత్యక్షంగా పాల్గొననున్నాడు. సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమం (Movement) చేయనుంది. మోదీ పర్యటన నేపథ్యంలోనే ఈ మహా ధర్నా చేపట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. మోదీ పర్యటనపై ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోంది.