»Telangana 108 Ambulance Staff Saved 23 Days Child With Cpr In Siddipet
CPRతో 23 రోజుల పాపకు పునర్జన్మ.. మంత్రి హరీశ్ రావు ప్రశంసలు
సీపీఆర్ తో 23 రోజుల పసిపాపకు పునర్జన్మ దక్కడం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిదర్శనంగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సీపీఆర్ తో పాపను కాపాడిన వీడియో వైరల్ గా మారింది.
తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) చేపట్టిన ఓ కార్యక్రమం చాలా మందికి పునర్జన్మ (Rebirth) లభిస్తోంది. విలువైన మనుషుల ప్రాణాలు కాపాడుతోంది. తాజాగా 23 రోజుల పసిపాపకు (Baby Girl) పనర్జన్మ లభించింది. స్నానం (Bath) చేస్తుండగా నీళ్లు మింగడంతో పసిపాపకు శ్వాస (Breath) ఆడలేదు. వెంటనే చేరుకున్న 108 అంబులెన్స్ (Ambulance) సిబ్బంది సీపీఆర్ (CPR)తో ఆ చిన్నారికి ప్రాణం పోశారు. దీనిపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (T Harish Rao) ప్రశంసలు వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram) నిర్మాణ పనులకు బిహార్ కు చెందిన ప్రేమ్ నాథ్ యాదవ్, కవిత దంపతులు వచ్చారు. పనులు చేస్తూ అక్కడే ఉంటున్నారు. అయితే వీరికి 23 రోజుల కిందట ఓ పాప జన్మించింది. బుధవారం 23 రోజుల పసిబిడ్డ సుబ్బులక్ష్మికి తల్లిదండ్రులు స్నానం చేయిస్తున్నారు. ఈ సమయంలో చిన్నారి నీళ్లు మింగేసింది. దీంతో శ్వాస ఆగిపోయింది. పాప అచేతనంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే గ్రామానికి చెందిన ఏఎన్ఎం తిరుమల, ఆశా కార్యకర్తల సుగుణ 108 సిబ్బందికి సమాచారం.
వెంటనే అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అశోక్, వెంకట్ పాప పరిస్థితిని గమనించారు. పాప గుండె, నాడీ పని చేయడం లేదని ఈఆర్సీపీ డాక్టర్ చక్రవర్తికి విషయం తెలిపారు. వైద్యుడి సూచన మేరకు పాపకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation -CPR) చేశారు. పాప గుండెను కొన్ని సెకన్ల పాటు పలుమార్లు నొక్కారు. దీంతో పాప తేరుకుని కేర్ మంటూ ఏడ్చింది. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ తో ఆ పాపకు పునర్జన్మ లభించింది. పాప ప్రాణం నిలిపిన వైద్య సిబ్బందికి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సీపీఆర్ తో 23 రోజుల పసిపాపకు పునర్జన్మ (Reablement) దక్కడం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిదర్శనంగా బీఆర్ఎస్ (BRS Party) నాయకులు పేర్కొన్నారు. ఇక మంత్రి హరీశ్ రావు సిబ్బందిని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం. CPR Saves Lives’ అని హరీశ్ రావు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇక సీపీఆర్ తో పాపను కాపాడుతున్న వీడియోలను పంచుకున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు 💐 అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం🙏🏻