»Inter Minor Lovers Suicide At Siddipet District Lachapet
Lovers suicide: ఇంటర్ లవర్స్ సూసైడ్..లేఖ లభ్యం!
ఇద్దరు మైనర్ లవర్స్ ఒకే ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అయితే వీరు ఎందుకు ఇలా చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరు మైనర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా(siddipet district)లోని దుబ్బాక పరిధిలోని లచ్చాపేట(lachapet)లో చోటుచేసుకుంది. బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, లచ్చాపేటలో పదో వార్డులో ఉంటున్న మైనర్ బాలుడు(ఇంటర్ రెండో సంవత్సరం) చదువుతున్నాడు. అయితే వీరిద్దరూ ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు. ఆ క్రమంలో వారికి ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమ(love) వరకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బుధవారం బాలుని ఇంట్లో వీరిద్దరూ ఒకే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ తర్వాత గుర్తించిన బాలుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో ఓ లేఖ లభ్యమైనట్లు తెలుస్తోంది. అసలు వారి ప్రేమ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసి వారు ఒప్పుకోకపోవడం వల్లనే ఇలా చేశారా? లేదా ఇంకైదైనా ఆర్థిక కారణాలు లేదా వీరి కుటుంబాల మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.