»Bjp Mla Rupjyoti Kurmi Urges Pm Modi To Demolish Taj Mahal Qutub Minar
Taj Mahalను కూల్చి ఆలయం కట్టండి: మోదీకి బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్
భారతదేశ గొప్ప సంపదగా భావించే చరిత్రను వక్రీకరించేందుకు సిద్ధమైంది. విద్యను కాషాయీకరణ చేయడం తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీఈఆర్టీ సిలబస్ లో భారీ మార్పులు చేస్తోంది. 12వ తరగతి సిలబస్ లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలు తొలగించారు. దీంతో పాటు హిందీ పుస్తకంలో కొన్ని పద్యాలు, పేరాగ్రాఫ్ లు తొలగించింది.
మతతత్వం (Religiosity) పేరిట బీజేపీ సాగిస్తున్న రాజకీయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. మతతత్వం పేరిట చారిత్రక ఆనవాళ్లను చెరిపేసే కుట్ర జరుగుతోంది. దీనిపై చరిత్రకారులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా నగరాలు, కట్టడాల పేర్లు నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం మార్చేసింది. ఇక చారిత్రక కట్టడాలపై కూడా బీజేపీ దృష్టి సారిస్తోంది. ఎప్పటి నుంచో బీజేపీ నాయకులు ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ (Taj Mahal)ను కూల్చివేయాలనే డిమాండ్ చేస్తున్నారు. తాజ్ మహల్ ను ఒక సమాధిగా పేర్కొంటున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే దీన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ప్రధాని మోదీకి విజ్ణప్తి చేశాడు.
తాజ్ మహల్, కుతుబ్ మీనార్ (Qutub Minar) తదితర కట్టడాలు భారతదేశానికి గొప్ప వారసత్వ సంపదగా ఉన్నాయి. వాటిని కూల్చివేయాలంటూ అస్సాం (Assam) బీజేపీ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మీ (Rupjyoti Kurmi) డిమాండ్ చేశారు. వాటిని కూల్చిన చోట అందమైన ఆలయాలు నిర్మించాలని పనికిమాలిన ప్రతిపాదన చేశాడు. నేషనల్ కౌన్సిల్ ఆప్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పాఠ్య పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన పాఠ్యాంశాలు తొలగించింది. ఇదే విషయాన్ని మాట్లాడుతూ.. పుస్తకాల్లో పాఠ్యాంశాలతో పాటు సజీవంగా కనిపిస్తున్న తాజ్ మహల్, కుతుబ్ మినార్ కట్టడాలను కూల్చాలని ప్రధానికి కోరుతున్నట్లు తెలిపాడు.
‘ఆ రెండింటిని కూల్చేసి వాటి స్థానంలో అందమైన ఆలయాలు నిర్మించాలి. ఆ రెండు ఆలయాల నిర్మాణ శైలి ఏ ఇతర స్మారక చిహ్నానికి దగ్గరగా ఉండకూడదు. కావాల్సి వస్తే ఆ ఆలయాల నిర్మాణానికి నా ఏడాదిన్నర జీతాన్ని విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అని రూప్ జ్యోతి కుర్మీ పేర్కొన్నాడు. కాగా అతడు గతేడాది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరాడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతడు గతేడాది ఎన్నికల సమయంలో పార్టీ మారాడు. మరియాని అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాడు. పార్టీ మారాడో లేదో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు.
కాగా చారిత్రక విషయాల్లో బీజేపీ తలదూరుస్తోంది. భారతదేశ గొప్ప సంపదగా భావించే చరిత్రను వక్రీకరించేందుకు సిద్ధమైంది. విద్యను కాషాయీకరణ చేయడం తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీఈఆర్టీ సిలబస్ లో భారీ మార్పులు చేస్తోంది. 12వ తరగతి సిలబస్ లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలు తొలగించారు. దీంతో పాటు హిందీ పుస్తకంలో కొన్ని పద్యాలు, పేరాగ్రాఫ్ లు తొలగించింది. ఇలా విద్య విషయంలో రాజకీయం చేయడంపై తీవ్ర దుమారం రేపుతున్నది. విద్యార్థులకు వాస్తవ చరిత్ర తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.