అర్ధరాత్రి కరీంనగర్ (Karimnagar)లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ కేసు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన స్టేషన్ (Police Station)కు వచ్చేందుకు ససేమిరా అనడంతో బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఈ సమాచారం తెలుసుకున్న బండి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వారిని పక్కకు నెట్టేసి పోలీసులు సంజయ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఎక్కడికి తరలించారనేది స్పష్టత లేదు.
ఇటీవల సంజయ్ అత్త (Mother In Law) కన్నుమూసింది. ఆమె 9 రోజుల కార్యక్రమం బుధవారం నిర్వహిస్తుండడంతో కరీంనగర్ లోని తన అత్త ఇంటికి సంజయ్ మంగళవారం రాత్రి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12.45 సమయంలో ‘మీరు స్టేషన్ కు రావాలి’ అని పోలీసులు కోరారు. ఎందుకు? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించాడు. స్టేషన్ కు వచ్చాక అన్ని చెబుతామని పోలీసులు సమాధానమిచ్చారు. చెబితేనే వస్తానని అతడు మొండికేశాడు. ఎంత విన్నవించినా సంజయ్ రావడానికి ఇష్టపడకపోవడంతో ఏసీపీ తుల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సంజయ్ ను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో సంజయ్ అనుచరులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు అడ్డంగా నిల్చుని ఆందోళన చేశారు. పోలీసులను ముందుకు వెళ్లకుండా బంధించారు. వాళ్లనందరినీ చెదరగొట్టి సంజయ్ ను పోలీసులు తీసుకెళ్లిపోయారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం మాత్రం చెప్పలేదు. అరెస్ట్ వార్త తెలుసుకున్న బీజేపీ శ్రేణులు బుధవారం తెల్లవారుజాము నుంచి ఆందోళనలు చేపట్టాయి. కాగా అరెస్ట్ ఏ కేసులో చేసిన విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం సంజయ్ ఎక్కడ ఉన్నది కూడా ఎవరికీ తెలియదు.
కాగా టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ లో, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ జోక్యం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిన్న పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీలో సంజయ్ అనుచరులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక గతంలో టీఎస్ పీఎస్సీ లీకేజీలో చేసిన ఆరోపణలకు సంజయ్ వివరణ ఇవ్వాలని సిట్ కోరగా స్పందించలేదు. సిట్ ఆదేశాల మేరకు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది.
Karimnagar, Telangana | BJP state president Bandi Sanjay detained by police from his residence in Karimnagar
Police have arrested BJP state president Bandi Sanjay from his residence illegally. This is nothing but to disturb PM Modi’s program in Telangana: BJP State General… pic.twitter.com/LeipGaR2sC