»Dalit Associations Says Thanks To Kcr On Dr Br Ambedkar Statue Built
Dr BR Ambedkar Statue నిర్మాణంపై సీఎం KCRకు దళిత వర్గం కృతజ్ఞతలు
అత్యంత ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ లోని కొత్త సచివాలయం సమీపంలో 125 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మించడంపై దళిత వర్గాలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాయి.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ లోని కొత్త సచివాలయం సమీపంలో 125 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మించడంపై దళిత వర్గాలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాయి. విగ్రహం నిర్మాణం, కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడంపై దళిత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభ నిర్వహించారు.
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతా దళ్, ఎస్సీ ఎస్టీ అధికారుల ఫోరం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కృతజ్ఞత సభకు దళిత వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్ దేవ్ థోరట్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎస్ పీఎస్ సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, తెలంగాణ మహిళా యూనివర్సిటీ వీసీ విజ్ణులత తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున అత్యంత ఎత్తయిన విగ్రహం నిర్మాణం, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం గర్వకారణంగా పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
కాగా సమావేశానికి ముందు ప్రారంభానికి సిద్ధమవుతున్న అంబేడ్కర్ విగ్రహా వద్ద దళిత నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మాణ తీరును పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న అధికారులతో విగ్రహ నిర్మాణ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ విగ్రహం ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఈ విగ్రహం నిర్మించిన విషయం తెలిసిందే.