తెలంగాణ (Telangana) ఇతివృత్తం నేపథ్యంలో రూపుదిద్దుకున్న దసరా సినిమా (Dasara Movie) కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. ఈ సినిమాలో నటించిన నటి పూర్ణ (Poorna) ఇంట్లో పండుగ వాతావరణం అలుముకుంది. ఆమె పండంటి మగ బిడ్డకు (Baby Boy) జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. దుబాయ్ (Dubai)లోని ఓ ఆస్పత్రిలో జన్మనివ్వగా ఆ విషయాలను సామాజిక మాధ్యమాల్లో పూర్ణ పంచుకుంది. దీంతో ఆమెకు సినీ, బుల్లితెర ప్రముఖులు శుభాకాంక్షలు (Greetings) చెబుతున్నారు.
తెలుగులో శ్రీ మహాలక్ష్మి, అవును, సీమటపాకాయ్, అఖండ (Akhanda) వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ, యలయాళ చిత్రాల్లో కూడా నటించింది. కేరళకు చెందిన పూర్ణ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షనీద్ ఆసిఫ్ అలీని (Shanid Asif Ali) 2022 అక్టోబర్ లో వివాహమాడింది. డిసెంబర్ 31న తల్లిని కాబోతున్నట్లు తన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రకటించింది. ఆ తర్వాత తన శ్రీమంతం వీడియోను కూడా విడుదల చేసింది. తాజాగా ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పూర్ణ తెలిపింది. సోమవారం రాత్రి దుబాయ్ లోని ఓ ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. ఈ సందర్భంగా బెడ్ పై బిడ్డతోపాటు వైద్యులతో ఉన్న ఫొటోలను పూర్ణ పంచుకుంది. తొలి ప్రసవం ఆస్పత్రిలో జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ ఫొటోలను చూసిన వారంతా పూర్ణకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాల్లో పని చేసినా ఆమెకు మాత్రం బుల్లితెరకు చెందిన వారితోనే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆమెకు బుల్లితెర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
తీస్ మార్ ఖాన్, అఖండ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన పూర్ణ ఇటీవల విడుదలైన దసరా సినిమాలోనూ మెరిసింది. విలన్ కు భార్య పాత్రలో వదినమ్మగా పూర్ణ నటించింది. సినిమాలే కాదు బుల్లితెరపై కూడా పూర్ణ సందడి చేస్తోంది. కొన్నాళ్లు ఢీ షోలో జడ్జిగా కనిపించిన పూర్ణ ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి చాలా ప్రోగ్రామ్స్ లో కనిపించింది. సినిమాలు చేసుకుంటూ వ్యక్తిగత జీవితాన్ని పూర్ణ ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో ఆమె నటిస్తోంది.