rajamouli : దుబాయ్ నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటేసిన రాజమౌళి
హైదరాబాద్‌లో ఓటేసేందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏకంగా దుబాయ్ నుంచి ఫ్లైట్‌లో వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటేసి అందరినీ ఇన్స్పైర్ చేశారు.
rajamouli : తెలుగు అగ్ర సినీ దర్శకుడు రాజమౌళి ఓటర్లను సైతం ఇన్స్పైర్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా పనుల్లో దుబాయ్‌లో బిజీగా ఉన్న ఆయన ఓటేసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఫ్లైట్ దిగిన వెంటనే నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి రాజమౌళి(rajamouli) ఓటేసి వచ్చారు. తన భార్య రమా రాజమౌళితో కలిసి ఓటు(vote) వేశారు. చాలా అలసిపోయినట్లుగా వారిద్దరూ కనిపించారు.
ఓటు వేసిన తర్వాత దంపతులు ఇద్దరూ తీసుకున్న పిక్‌ని రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓటేసేందుకే తాము దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఆయన షేర్ చేసిన ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB29 పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ సినిమా కోసం మహేష్ బాబు సైతం తన ఫిజిక్‌ని మార్చుకునే పనిలో పడ్డారట. కసరత్తులు చేసేస్తూ మరింత ఫిట్‌గా మారుతున్నారట. ఈ సినిమా లొకేషన్స్‌ని అన్వేషించే పనిలోనే ప్రస్తుతం రాజమౌళి దుబాయ్‌లో (dubai) వర్క్ చేస్తున్నారని సమాచారం. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్‌గా ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.