Free Rides, Discounted Bus Tickets : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ర్యాపిడో సంస్థ వారికి ఫ్రీ రైడ్లను ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఓటర్లు ఈ ఫ్రీ రైడ్లను(Free Rides) వినియోగించుకోవచ్చని తెలిపింది. బైక్ ట్యాక్సీ, ఆటో, క్యాబ్‌ల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు తాము ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకున్నట్లు తెలిపింది.
ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ‘అభిబస్’ సైతం వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 11 నుంచ 15వ తేదీల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సొంత ఊళ్లకు వెళ్లి ఓటు వేయాలనుకునే వారికి ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరలో 20 శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. గరిష్ఠంగా రూ.250 వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. ‘ABHIVOTE’ అనే కూపన్ కోడ్‌ని వినియోగించి టికెట్లు కొనుక్కునే వారికి ఈ రాయితీలు వర్తిస్తాయని తెలిపింది.
అలాగే అభిబస్ యాప్‌లో బస్ టికెట్లు(Bus Tickets) బుక్ చేసుకునే వారికి మరో 100 రూపాలయ క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలూ ఉన్నాయని తెలిపింది. ‘సమ్మర్24’ కూపన్‌ని వినియోగించి టికెట్లు కొనుక్కునే వారు డ్రాకు అర్హులవుతారని చెప్పింది. డ్రాలో గెలుపొందిన వారికి ఏసీని బహౌకరిస్తున్నటలు వెల్లడించింది. ఓటర్లను ప్రోత్సహించడానికే తాము ఈ ఆఫర్లను తీసుకొచ్చినట్లు చెప్పింది.