»Inspections Across Telangana Are Inspections Dispatches Can Be Sent
EC : తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు తనిఖీలే.. పంపకాలు పంపకాలే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో నగదు, బంగారం, ఇతర రూపంలో అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 538.23 కోట్లకుపైగా ఉన్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు
తెలంగాణ (Telanagna) శాసన సభ ఎలక్షన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరుకు రూ538.23 కోట్లకుపైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాప్రాజ్ (Vikapraj) తెలిపారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు.. అమాత్యుల కార్లు, చివరకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌నూ వదలకుండా సోదాలు.. పట్టుబడుతున్న వందల రూ.కోట్ల నగదు, కిలలో కొద్దీ బంగారం. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల కమిషన్ (EC) అధికారులు తనిఖీలను పకడ్బందీగానే చేస్తున్నారు. అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఖర్చుకు తగ్గేదేలే అంటున్నారు. కొన్నిచోట్ల ఒక్కో అభ్యర్థి రోజువారీ ప్రచార ఖర్చు రూ.50 లక్షలు దాటుతోంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్నది బ్రహ్మరహస్యంగా మారింది. ఎన్నికల అభ్యర్థులు ఓటర్ల (Voters) ను ప్రలోభపెట్టకుండా నిలువరించే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అనేక నిబంధనలు అమలు చేస్తోంది. గత నెల 9న షెడ్యూల్ వెలువడిన వెంటనే 373 ఫ్లయింగ్ స్వ్కాడ్లు, 374 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు షురూ చేసింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది.