»Telangana Tammineni Veerabhadram Fire On Ys Sharmila B Team Statements
YS Sharmilaకు తీవ్ర భంగపాటు.. ఇదేనా మర్యాద అంటూ CPI(M) ఆగ్రహం
అపరిక్వత లేని కారణంగా షర్మిల ఆ విధంగా వ్యవహరించిందని తెలుస్తున్నది. వారి సమక్షంలోనే వారిపై విమర్శలు చేయడమంటే దుస్సాహసం కిందకు వస్తుంది. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని ఆ తర్వాత రాజకీయాలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
రాజకీయ పరిపక్వత లేకుండా రాజకీయం (Politics) చేస్తామంటే అది బెడిసికొడుతుంది. రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడే ముందు పది సార్లు కాదు వందసార్లు ఆలోచించుకుని మాట్లాడాల్సి ఉంటుంది. చేసే కార్యక్రమంపై ముందు అన్ని ఆలోచించాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తే ప్రజల ముందు పరువు పోగోట్టుకోవాల్సిందే. అలాంటి పరువునే వైఎస్ షర్మిల పోగొట్టుకుంది. రాజకీయం కోసం వేసిన తప్పటడుగుతో ఆమెకు తీవ్ర భంగపాటు ఎదురైంది. రాజకీయ విమర్శలు ఎక్కడ చేయాలో తెలియక షర్మిల తన పరువును తానే తీసుకుంది. ఆమె తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. సీపీఐ (ఎం) (Communist Party of India- Marxist) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఆఫీస్ కు వచ్చి ఇలా మాట్లాడడం ఆమె విజ్ణతకు వదిలేస్తున్నాం. ఆమెకు మర్యాద లేదు’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘ఓ పార్టీ అధ్యక్షురాలిగా.. దివంగత సీఎం వైఎస్సార్ YSR) కుమార్తెగా మా కార్యాలయానికి (Office) వస్తామంటే వైఎస్ షర్మిలను ఆహ్వానించాం. వైఎస్సార్ పై ఉన్న గౌరవం (Respect), మర్యాదతో పిలిస్తే సోదరి షర్మిల ఆ గౌరవం నిలుపుకోవడం లేదు. రాజకీయ వైఖరులు ఉంటాయి. ఆమె రాజకీయ వైఖరి ఆమెకు ఉంటుంది. మా రాజకీయ వైఖరి మాకు ఉంది. మునుగోడు ఎన్నికల్లో మేం చేసిన పని చాటుగా చేయలేదు. బాహాటంగా చేశాం. దానికి మా రాజకీయ వైఖరి ఏమిటో చెప్పాం. జాతీయ రాజకీయాల్లో మా పాత్ర ఏమిటో చెప్పాం. పైకి ఒక మాట.. చాటుగా ఒక మాట చేసే పార్టీ సీపీఎం కాదు. మాది జాతీయ పార్టీ. అట్లాంటి పార్టీని వారికి బీ టీమ్.. వీరికి బీ టీమ్ (B Team) అని విమర్శించే సాహసం మా కార్యాలయానికి వచ్చి చేయడం అంటే అది మంచిది కాదు. మా ఆఫీస్ లో ఉండగా ఆమె మాట్లాడినట్టు నేను నిందిస్తూ మాట్లాడలేను. నాకు విజ్ఞత ఉంది. మర్యాద ఉంది’ అంటూ తీవ్ర స్థాయిలో షర్మిల తీరును తప్పుబట్టారు.
ఆమె మర్యాద నిలుపుకోలేదని.. విజ్ఞత, మర్యాద లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేసిన ప్రతిపాదన సరైనది కాదని తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. ఆమెనే కార్యాచరణ సిద్ధం చేసుకుని.. ముందే నిర్ణయాలకు వచ్చి అన్ని పార్టీలను పిలవడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాలన్ని షర్మిలకు స్పష్టంగా పేర్కొన్నట్లు వీరభద్రం తెలిపారు. నిరుద్యోగుల తరఫున పోరాటం చేయడానికి షర్మిల ఉద్యమం చేయాలని భావించింది. దీనికి అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని భావించింది. ఈ క్రమంలోనే మంగళవారం టీజేఎస్ అధినేత కోదండ రామ్, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు తమ్మినేని వీరభద్రాన్ని షర్మిల కలిసింది. అయితే షర్మిల పక్కనే తమ్మినేని ఉండగానే ఆయనపైనే విమర్శలు చేయడం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. అపరిక్వత లేని కారణంగా షర్మిల ఆ విధంగా వ్యవహరించిందని తెలుస్తున్నది. వారి సమక్షంలోనే వారిపై విమర్శలు చేయడమంటే దుస్సాహసం కిందకు వస్తుంది. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుని ఆ తర్వాత రాజకీయాలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. మీడియా సమక్షంలోనే షర్మిల పరువును తమ్మినేని వీరభద్రం తీసేశారు.