పాలస్తీనాలో పరిస్థితులకు అద్దం పట్టే విదారక ఘటన ఒకటి గాజాలో చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నిండు గర్భిణి ప్రాణాలు విడిచింది. దీంతో ఆపరేషన్ చేసి మృతదేహం కడుపులో ఉన్న బిడ్డను వెలికి తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Palestinian Baby Is Born As Orphan : యుద్ధం ప్రజా జీవనంపై ఎంతటి దుష్రభావాన్ని చూపుతుందనడానికి ఉదాహరణగా నిలిచే ఓ హృదయ విదారకమైన ఘటన గాజాలో చోటు చేసుకుంది. అక్కడ బాంబులు, క్షిపణి దాడులతో రోజు పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాల్ని కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ గాజాపై( GAZA) జరిపిన వైమానిక దాడిలో ఓ పసికందు బయటి ప్రపంచాన్ని చూడక ముందే అనాథగా(ORPHAN) మారింది. ఆమె తల్లి ప్రసవించక ముందే అనంత లోకాలకు చేరుకుంది.
గాజాలో( పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. భీకర యుద్ధం(WAR) జరుగుతోంది. ఇజ్రాయెల్ నిర్విరామంగా క్షిపణి దాడులు చేస్తోంది. సబ్రీన్ అల్ సకానీ 30 వారాల గర్భవతి. దీంతో వారి కుటుంబం ఈ దాడులకు దూరంగా ఓ ఇంట్లో తలదాచుకున్నారు. ఇంతలోనే పెద్దగా శబ్దం అయ్యింది. సబ్రీన్ కుటుంబం ఉన్న ఇంటిపై క్షిపణి దాడి చేసింది. దీంతో సబ్రీన్, ఆమె భర్త, నాలుగేళ్ల కుమార్తె మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది సబ్రీన్ మృత దేహానికి సిజేరియన్ చేసి బిడ్డని వెలికి తీశారు.
ఆ పసికందుకు సబ్రీన్ జౌడా అని పేరు పెట్టారు. అయితే పసికందు బయటకు రావడంతోనే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడింది. కొంత వైద్యం తర్వాత శ్వాస తీసుకోవడం కాస్త సాధారణ స్థితికి వచ్చింది. అలా సబ్రీన్ పుడుతూనే తల్లిదండ్రులు, సోదరిని కోల్పోయింది. అయితే ఆమెను చూసిన నానమ్మ కన్నీరు మున్నీరయ్యారు. తన కొడుకు తాలూకు జ్ఞాపకం ఈ బిడ్డ అంటూ చెప్పారు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని, ఆమే తన ఆత్మ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఘటన గురించి తెలుసుకున్నవారంతా బరువెక్కిన హృదయాలతో బిడ్డను ఆశీర్వదించారు.