NRPT: జిల్లాలో చిత్తడి నేలల (వెట్‌ల్యాండ్స్) జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లోపు చిత్తడి నేలల జాబితాను తయారు చేయాలని, ఏడాదిలోపు సమగ్ర డిజిటల్ జాబితాను సిద్ధం చేయాలని శుక్రవారం ఆమె సూచించారు. గుర్తింపులో నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.