»Prabhu Deva Blessed With Third Child From His Second Marriage
Prabhudeva: 50ఏళ్ల వయసులో మరోసారి తండ్రైన ప్రభుదేవ
ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా(prabhudeva) 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యారు. తన రెండో భార్య హిమానీ సింగ్ ముంబైలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ డాన్స్ మాస్టర్ నాలుగోసారి తండ్రి అయ్యాడు. అయితే వారి కుటుంబంలో మొదటిసారి ఆడపిల్ల జన్మించడంతోవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవా(prabhudeva) గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ యాక్టర్‌గా, దర్శకుడిగా మారి తన కెరీర్లో ఎన్నో సూపర్హిట్లను అందించాడు. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూనే, ఎంపిక చేసిన పాటలకు కొరియోగ్రఫీ కూడా చేస్తున్నాడు. తాజాగా ప్రభుదేవా మరోసారి తండ్రి అయ్యారు. దాదాపు 50ఏళ్ల వయసులో ఆయన తండ్రి(father) కావడం విశేషం. ఆయనకు తాజాగా ఆడబిడ్డ పుట్టింది. ఇది శుభవార్తే అయినప్పటికీ, ఆయన ఎప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు అనేది అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
2011లో తన మొదటి భార్య రమలతతో విడాకులు తీసుకున్న ప్రభుదేవా పెళ్లి(marriage) ఎప్పుడనేది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 90వ దశకంలో ప్రభుదేవా తన గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరైన రమాలత్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె తరువాత తన మతాన్ని హిందూ మతంలోకి మార్చుకుంది. ఆమె పేరును రామలతగా మార్చుకుంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత ప్రభుదేవా-నయనతార ఎఫైర్ వెలుగులోకి రావడంతో అతని కుటుంబంలో గొడవలు జరిగి చివరకు విడాకులకు దారి తీసింది. కానీ, ప్రభుదేవా-నయనతార కూడా విడిపోయారు. కాలక్రమంలో నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కవల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ప్రభుదేవా తన ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ హిమానీ సింగ్‌ను 2020లో వివాహం చేసుకున్నాడు. ఈ జంట ఇటీవల ఒక ఆడ శిశువుకు(girl child) జన్మనివ్వడం విశేషం.