»Animal Movie Pre Teaser Ranbir Kapoors Animal Pre Teaser Released
Animal Movie Pre-Teaser: రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ ప్రీ టీజర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో డైరెక్టర్ సందీప్ వంగా యానిమల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి మూవీ డైరెక్టర్ సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్ లో యానిమల్ మూవీ చేస్తున్నాడు. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాను ఈ డైరెక్టర్ కబీర్ సింగ్‌గా హిందీలో తెరకెక్కించాడు. ఇప్పుడు యానిమల్ అనే వైలెంట్ యాక్షన్ మూవీ(Animal Movie) చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ మూవీ విడుదల కానుంది.
— Sandeep Reddy Vanga (@imvangasandeep) June 11, 2023
‘యానిమల్’ మూవీ విడుదల నేపథ్యంలో ప్రీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా రిలీజైన ప్రీ టీజర్ అదిరిపోయింది. ప్రీ టీజర్ తోనే సినిమాపై తిరుగులేని హైప్ వచ్చింది. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటిస్తోంది. ఈ మూవీలో రణ్‌బీర్ ఫిజిక్స్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.