Animal: ఓటీటీ రికార్డులన్నీ బ్రేక్ చేస్తున్న ‘యానిమల్’
రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అనిమల్ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు కలెక్షన్లతో పాటు విమర్శలు కూడా గట్టిగా వచ్చాయి. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఓటిటిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది యానిమల్.
Animal: డిసెంబర్ 1న రిలీజ్ అయిన అనిమల్ సినిమా.. కాస్త లేట్‌గా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్కు వచ్చింది. ఇక ఈ సినిమా ఓటిటిలోకి వచ్చినప్పటి నుంచి టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండడం విశేషం. సలార్ మూవీని సైతం వెనక్కి నెట్టి ఇండియన్ మూవీస్ ఓటిటి రికార్డులను బ్రేక్ చేస్తోంది యానిమల్. ఆర్ఆర్ఆర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన 10 రోజుల్లో 2.55 కోట్ల గంటల వ్యూయర్షిప్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసి.. 10 రోజుల్లోనే ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్షిప్ నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది యానిమల్. దీంతో ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది.
అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉండటం విశేషం. ఇండియాలో ఇప్పటి వరకూ 55 లక్షల వ్యూస్ వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. థియేటర్లో కూడా యానిమల్ టాక్‌తో సంబంధం లేకుండా దుమ్ముదులిపేసింది. దాదాపు 900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇప్పుడు ఓటిటిలోను హవా చూపిస్తోంది యానిమల్. అయినా కూడా ఇప్పటికీ సందీప్ రెడ్డి వంగపై విమర్శలు వస్తునే ఉన్నాయి. స్త్రీలను అగౌరవపరిచేలా ఉందంటూ.. ఎవరో ఒకరు విమర్శిస్తునే ఉన్నారు. వారికి దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నాడు సందీప్. అయినా.. కూడా యానిమల్ ఓటిటి క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.