మాస్ మహారాజా అంటేనే థియేటర్లో మాస్ జాతర జరగాల్సిందే. అలాంటిది ఊరమాస్‌గా రగ్గ్డ్ లుక్‌లో, గడ్డంతో మాస్ రాజా కనిపిస్తే ఇంకెలా ఉంటుందో చూపించడానికి ఈగల్ సినిమా రాబోతోంది. తాజాగా ఈ సినిమా రన్ టైం అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.
Eagle: చివరగా టైగర్ నాగేశ్వర రావుగా వచ్చిన రవితేజ.. ఫిబ్రవరి 9న ఈగల్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈగల్ టీజర్, ట్రైలర్స్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. లేటెస్ట్గా రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ కూడా అదిరింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ సినిమా మాస్ యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈగల్‌కు యు/ఏ జారీ చేసింది. ఇక రన్ టైం వచ్చేసి 158 నిముషాలుగా లాక్ చేశారు. అంటే 2 గంటల 38 నిమిషాల నిడివితో థియేటర్లోకి రానుంది ఈగల్. ఇక, ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయేలా ఉందని చెప్పారని సమాచారం. మేకర్స్ కూడా ఇదే చెబుతున్నారు. లాస్ట్ 40 నిమిషాలు ఈగల్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఇప్పటికే స్పెషల్ షో చూసిన రవితేజ.. ఫుల్ సాటిస్ఫైడ్ అని ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే.. ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటికొచ్చాయి.
నైజాంలో 6 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 8.5 కోట్లు.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక సహా రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్లు.. ఓవర్సీస్లో 2 కోట్లు కలుపుకొని.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి 21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. ఈ లెక్కన ఈగల్ సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. మాస్ మహారాజా చెప్పినట్టుగా ఈగల్‌కు సాలిడ్ హిట్ టాక్ పడితే.. ఇదేం పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి. మరి ఈగల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే.. సినిమా టాక్ బయటికొచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.