లాస్ట్ ఇయర్ ఎండింగ్లో అనిమల్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకు రష్మిక. ఈ సినిమాలో రష్మికకు మంచి క్యారెక్టర్ పడింది. దీంతో అనిమల్ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేసింది అనుకున్నారు. కానీ అలా జరగలేదని చెబుతోంది. అయితే.. ఓ అభిమాని దెబ్బకు దిగొచ్చింది రష్మిక.
Rashmika Mandanna: అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో ఓ రేంజ్లో రొమాన్స్ చేసింది రష్మిక. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. రష్మిక, రణ్‌బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది అనిమల్ సినిమా. కానీ రష్మిక మాత్రం.. ఇతర సినిమాల షూటింగ్ కారణంగా అనిమల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే.. రష్మిక మందన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుంటుంది.
అలా అని తన అభిమానులందరికీ రిప్లే ఇవ్వడం కుదరదు. కానీ తాజాగా ఓ అభిమాని చేసిన పనికి దిగొచ్చింది రష్మిక. లేటెస్ట్గా రష్మిక తన ఇన్‌స్టాలో ఓ సెల్ఫీ షేర్ చేసింది. ఈ సందర్భంగా.. ఓ అభిమాని తనకు రష్మిక రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘ఈ రోజు కనీసం హాయ్ అని రిప్లై ఇవ్వకపోతే ఏమీ తినను, నిరాహార దీక్ష చేస్తా..’ అంటూ వారం రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టాడు. దీనికి రష్మిక స్పందించలేదు. దీంతో.. రష్మిక సెల్ఫీ ఫోటోలను షేర్ చేస్తూ.. మిర్రర్ సెల్ఫీ తీసుకున్నావ్, అదే గ్యాప్‌లో నాకు ఒక రిప్లై ఇవచ్చుగా అంటూ.. కన్నీళ్లు పెడుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.
ఇక చేసేది లేక.. అతనికి రిప్లే ఇచ్చింది రష్మిక. నవ్వుతూ ఉన్న ఎమోజీలను షేర్ చేస్తూ.. ‘గ్యాప్‌లో అంట.. వర్క్ గ్యాప్‌లో ఈ సెల్ఫీ తీసుకున్నానురా, సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్ లేకుండే’.. అంటూ రిప్లే ఇచ్చింది. దీంతో ఆ అభిమాని గాల్లో గంతేశాడు. నువ్వు అలా ‘రా’.. అంటుంటే ఎంత బాగుందో అంటూ.. రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.