చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, మాజీ జడ్పీ ఛైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు సోమవారం రాత్రి తిరుమలలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. చిత్తూరు నియోజకవర్గంలోని దిగువమాసపల్లిలో శ్రీ గోవిందరాజుల గుట్టపై వెలసిన శ్రీవారి పాదాలు ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. స్థానిక ఆలయాల అభివృద్ధిపై ఆయనతో చర్చించారు.