Rashmika Mandanna: ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసిన రష్మిక..!
నేషనల్ క్రష్ రష్మిక మందన క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. యానిమల్ తర్వాత రష్మికకు పాన్ ఇండియా సినిమాలు క్యూలు కడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏకంగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. పుష్ప మూవీ తర్వాత ఆమె గ్లోబల్ బ్యూటీ మారిపోయింది. ఆ మూవీ తర్వాత రష్మిక ఫుల్ బిజీగా మారిపోయిందని చెప్పొచ్చు. చివరగా ఆమె యానిమల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ భారీ విజయాన్ని పొందింది. రణబీర్ కపూర్ సరసన ఆమె నటనకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
యానిమల్ తర్వాత రష్మికకు పాన్ ఇండియా సినిమాలు క్యూలు కడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏకంగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కింది. ‘స్పిరిట్’ అనే యాక్షన్ డ్రామాలో ప్రభాస్‌ను డైరెక్ట్ చేయడానికి శ్రీ వంగ సైన్ ఇన్ చేసిన సంగతి మనకు తెలిసిందే. T-సిరీస్ కింద భూషణ్ కుమార్ చేత బ్యాంక్రోల్ చేశారు. ఈ మూవీలో ప్రభాస్ మొదటిసారిగా పోలీసుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక ఎంపికైనట్లు తాజా సమాచారం.
అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీలో నిజంగా రష్మిక కు ఛాన్స్ వస్తే.. ఆమె కెరీర్ మరో మలుపు తిరిగే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్‌తో నటించాలని చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు ఆశపడుతుంటే.. ఆ ఛాన్స్ ఇప్పుడు రష్మిక కు రావడం ఆమె అదృష్టం అనే చెప్పాలి.