AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో ఈనెల 23వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.