MLG: తాడ్వాయి(M) ఎల్లాపూర్ గ్రామంలో ఇవాళ CPM నేతలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వీబీ-జీ రామ్ జీ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకే కేంద్రం ఈ కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఈ బిల్లు కార్మికుల హక్కులను దెబ్బతీస్తుందని ఆరోపించారు. బిల్లు ప్రతులను దహనం చేసి నినాదాలు చేశారు.