Israel-Palestina: 40 మంది చిన్నపిల్లల తలలు నరికి కిరాతకం
40 మంది చిన్నారుల తలలు నరికి హమాస్ తీవ్రవాదులు క్రూరత్వానికి దెగబడ్డారు. ఈ ఘటన ప్రపంచ దేశాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోలను విడుదల చేసింది.
ఇజ్రాయెల్ – పాలస్తీనా (Israel-Palestina) మధ్య చెలరేగిన యుద్ధం (War) ఎందరో అమాయకులను పొట్టనపెట్టుకుంటోంది. ఎంతో మంది చిన్నారులను, పసిపిల్లలను, మహిళలను బలి తీసుకుంటోంది. ఎప్పుడు ఏ బాంబు తమపై పడుతుందోనని ఆ ప్రాంతాల్లోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హమాస్ తీవ్రవాదులు, ఇజ్రాయెల్ దళాల మధ్య జరుగుతున్న భీకర ఆధిపత్య పోరులో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు విడిచారు. తాజాగా యుద్ధంలో జరిగిన ఈ దారుణ ఘటన అందర్నీ కంటతడి పెట్టేలా చేస్తోంది.
'It's not a war, it's not a battle. It's a massacre'
Journalists are let into Kfar Aza for the first time, four days after the community came under the shock attack by Hamas terrorists
IDF Major General Itai Veruv describes the scene of brutal violence, where whole families… pic.twitter.com/HJzoMKj2Ta
యుద్ధంలో 40 మంది చిన్నారులు అత్యంత క్రూరంగా హత్యకు గురవ్వడం అందర్నీ కలచివేస్తోంది. 40 మంది శిశువులతో సహా డజన్ల కొద్దీ బాధితుల మృతదేహాలను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించిన ఘటన కలకలం రేపుతోంది. వారిలో చాలా మంది శిశువుల తలలు నరికేసి ఉండటాన్ని చూసి వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
హమాస్ తీవ్రవాదులే 40 మంది చిన్నారుల తలలు నరికి కిరాతకానికి ఒడిగట్టారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. కిబ్బత్జ్ క్ఫర్ అజా(Kibbutz Kfar Aza) అనే ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. హమాస్ (Hamas) తీవ్రవాదులు చేసిన క్రూరత్వాన్ని ప్రపంచం మొత్తం చూడాలని ఇజ్రాయెల్ మీడియా ఈ విషయాలను తెలియజేస్తూ పలు వీడియోలను విడుదల చేసింది.