SRD: సింగూర్ డ్యామ్ మరమ్మతులకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య సోమవారం అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సింగూర్ నీటిని 517.5 లెవెల్ వరకు ఖాళీ చేయనున్న నేపథ్యంలో మిగిలిన 8.17 టీఎంసీల నీటిని ఎగ్జిస్టింగ్ సోర్స్‌ల ద్వారా ప్రజలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేసేలా సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.