MDK: తూప్రాన్ ఐఓసీ కార్యాలయ సముదాయంలో టీపీటీఎఫ్ సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ను తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి ఆవిష్కరించారు. విద్యారంగంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, బడుగు బలహీన వర్గాల పిల్లల అభివృద్ధికి పాటుపడాలని ఆర్డీవో సూచించారు. తూప్రాన్ మండలాన్ని ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని పేర్కొన్నారు.