MNCL: ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బొజ్జు కోరారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ప్రతి సంవత్సరం 2000 మంది విద్యార్థులు ఇంటర్ను పూర్తి చేస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించాలని నియమించాలని ఆయన కోరారు.