వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో అక్రమంగా చైనా మంజా విక్రయాలు జరుగుతున్నాయన్న నమ్మకమైన సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పిన్న మురళి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ:78,700 విలువగల చైనా మాంజాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ACP మధుసూదన్ తెలిపారు.