MBNR: బాలికలు, మహిళల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని శుక్రవారం జిల్లా ఎస్పీ డి. జానకి అన్నారు. బస్స్టాండ్లు, బహిరంగ ప్రదేశాల్లో అసురక్షితంగా అనిపిస్తే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కు లేదా షీ టీమ్ నంబర్ 8712659365కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలు సిద్ధంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.