హీరా గ్రూప్ చీఫ్ నౌహీరా షేక్ అక్రమార్జన కేసులో ఈడీ కీలక చర్యలు చేపట్టింది. పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి రూ.5,978 కోట్ల మోసానికి పాల్పడిన నౌహీరాకు చెందిన రూ.19.64 కోట్ల విలువైన ఆస్తిని ఈడీ వేలం వేసింది. వేలం ప్రక్రియ, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.428 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆ మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.