»Karnataka Assembly Poll Aimim Party To Contest In 25 Seats In Karnataka
Karnataka Poll 25 చోట్ల పోటీకి సై.. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ దోస్త్
ప్రస్తుతం ఎన్నికల వేళ కేసీఆర్ సూచనతో ఎంఐఎం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకే ఎంఐఎం జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది.
సార్వత్రిక సమరానికి ముందు కర్ణాటకలో (Karnataka) జరుగుతున్న ఎన్నికలు తీవ్ర ఉత్కంఠగా జరుగుతున్నాయి. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) ముద్రపడిన బీజేపీని ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అనేక సర్వేలు వెల్లడించాయి. దీంతో వచ్చేది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమా? లేదా గతంలో మాదిరి సంకీర్ణ ప్రభుత్వమా అనేది తేలడం లేదు. ప్రస్తుతానికి ఓటరు నాడి కాంగ్రెస్ వైపు ఉందని తెలుస్తున్నది. అయితే హస్తం పార్టీ అధికారంలోకి రాకపోతే జేడీఎస్ తో కలిసి మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఆ రాష్ట్రంలో మరో పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది. ఆ పార్టీనే ఏఐఎంఐఎం (AIMIM).
తెలంగాణ (Telangana) అది కూడా ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)లోని పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోటీ చేసి కొన్ని స్థానాలను సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు కర్ణాటకలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల బరిలో తాము నిలుస్తామని ఏఐఎంఐఎం పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ (Usman Ghani) ప్రకటించాడు. 224 అసెంబ్లీ స్థానాల్లో తమ ప్రాబల్యం ఉన్న 25 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించామని, త్వరలోనే మిగిలిన 22 మంది అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించాడు.
‘పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు పొత్తుల కోసం నిరీక్షిస్తున్నాం. జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవేగౌడతో పొత్తులపై చర్చించాం. ఆయన ప్రతిస్పందించాల్సి ఉంది. మా భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీలతో పొత్తులకు సిద్ధం’ అని ఉస్మాన్ ఘనీ తెలిపాడు. ఇక కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసే ఆలోచన లేదని పేర్కొన్నాడు. ‘ముస్లింలను బీసీ కేటగిరి నుంచి తొలగించి 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసినా లౌకికభావం ఉన్నవారు ఎందుకు నిలదీయడం లేదు. మేము ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నామని విమర్శించడం సరికాదు’ అని కాంగ్రెస్ పై ఉస్మాన్ ఘనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ తో కర్ణాటకలోని జేడీఎస్ కూడా మిత్రుడిగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎన్నికల వేళ కేసీఆర్ సూచనతో ఎంఐఎం రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకే ఎంఐఎం జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. త్వరలోనే జేడీఎస్, ఎంఐఎం పొత్తు ఖరారయ్యే అవకాశం