»Janasena Leader Konidela Nagababu Reacts On Ramoji Rao Cid Investigation
Ramoji Raoకు అండగా నాగబాబు.. YS Jaganపై తీవ్ర ఆగ్రహం
తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అవినీతి, దాడులు, వైఎస్సార్ సీపీ అరాచకత్వంపై ఈనాడు వెలుగులోకి తీసుకువస్తున్నది. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు.
మీడియా మొఘల్ (Media Moghal)గా పేరుపొందిన రామోజీ గ్రూపు (Ramoji Groups) సంస్థల అధినేత రామోజీ రావుపై (Ramoji Rao) ఆంధ్రప్రదేశ్ కక్షపూరిత చర్యలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Govt of Andhra Pradesh) ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తోందని సర్వత్రా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ (YS Jagan) దురుద్దేశంతో ఆయనపై విచారణ చేపడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా బలవంతంగా విచారణ పేరుతో రామోజీరావును వేధించడంపై (Harassment) పలు మీడియా సంస్థలు ఖండిస్తున్నాయి. తాజాగా జనసేన పార్టీ (JanaSena Party) సీనియర్ నాయకుడు, సినీ నటుడు నిర్మాత కొణిదెల నాగబాబు (Konidela Nagababu) స్పందించాడు. విచారణ పేరుతో చేస్తున్న హడావుడిని తప్పుబట్టారు. ఆయనపై సీఎం జగన్ పాల్పడుతున్న చర్యలను ఖండించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ (Twitter)లో ఓ పోస్టు చేశారు.
‘తెలుగు సినీ, మీడియా రంగంలో (Media) విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకువచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో “గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన “పద్మ విభూషణ్” (Padma Vibhushan) రామోజీ రావు లక్షలాది మందికి ఆదర్శం. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వైసీపీ అధికారంలోకి వచ్చాక పుట్టుకు రావడం విచారకరం. ఏడు పదుల వయసుపైబడిన రామోజీ రావుని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం. రామోజీ రావుపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం’ అని నాగబాబు ట్వీట్ చేశాడు.
తన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అవినీతి, దాడులు, వైఎస్సార్ సీపీ (YSRCP) అరాచకత్వంపై ఈనాడు వెలుగులోకి తీసుకువస్తున్నది. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంపై సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే మార్గదర్శి (Margadarsi Chit Fund) చిట్ ఫండ్ సంస్థలపై దాడులు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయా సంస్థల కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేశాయి. ఇదే క్రమంలో అనారోగ్యంతో బెడ్ పై ఉన్న రామోజీరావును విచారించారు. ఆయనపై వ్యవహరించిన తీరుపై చాలా మంది తప్పుబడుతున్నారు.
తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకు వచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో "గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన "పద్మ విభూషణ్" శ్రీ రామోజీ రావ్ గారు… 1/3