»Two Arrested On Shooting With Drone Camera Shooting In Yadadri Temple
శ్రీరామనవమి వేళ యాదాద్రిలో Drone Camera కలకలం.. ఇద్దరు అరెస్ట్
ఇది జరిగిన కొన్ని నెలల్లోనే మళ్లీ డ్రోన్ కెమెరా చిత్రీకరణ చేయడం వివాదం రాజేస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రముఖ ఆలయంపై నుంచి చిత్రీకరణ చేయవద్దు. హిందూ శాస్త్రం (Hindu) ప్రకారం ఆలయ గోపురంపై ఎలాంటి విహంగాలు సంచరించవద్దు.
తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ (Yadadri Sri Lakshmi Narasimha Swamy Devasthanam) ప్రాంగణంలో మరోసారి డ్రోన్ కెమెరా (Drone Camera) కలకలం రేపాయి. అనుమతి లేకుండానే ఆలయ పరిసరాల్లో డ్రోన్ తో చిత్రీకరణ (Shooting) చేయడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు (YTDA) రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి ఆలయంలో శ్రీరామనవమి (Sri Rama Navami) ఉత్సవాలు జరుగుతున్న వేళ ఈ పరిణామం షాక్ కు గురి చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
యాదాద్రి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సమయంలో ఆలయ ప్రాంగణంలో డ్రోన్ కనిపించింది. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో ఆలయాన్ని చిత్రీకరించడంపై ఆలయ అధికారులు అభ్యంతరం (Objection) వ్యక్తం చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు (Police) చిత్రీకరణ చేసిన వారిని గుర్తించారు. చిత్రీకరణ చేసిన హైదరాబాద్ (Hyderabad) జీడిమెట్లకు (Jeedimetla) చెందిన సాయికిరణ్, జాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయాన్ని ఎందుకు చిత్రీకరణ చేస్తున్నారు? ఎవరి అనుమతితో చేస్తున్నారు? అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
యాదాద్రి ఆలయంలో గతేడాది డిసెంబర్ (December) 22వ తేదీన కూడా ఇలాగే డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ చేశారు. ఆలయ సమీపంలో డ్రోన్ తో చిత్రీకరణ చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇది జరిగిన కొన్ని నెలల్లోనే మళ్లీ డ్రోన్ కెమెరా చిత్రీకరణ చేయడం వివాదం రాజేస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రముఖ ఆలయంపై నుంచి చిత్రీకరణ చేయవద్దు. హిందూ శాస్త్రం (Hindu) ప్రకారం ఆలయ గోపురంపై ఎలాంటి విహంగాలు సంచరించవద్దు. తిరుమల ఆలయంపై (Tirumala Temple) కూడా ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. విమానాలు సంచరించకూడదు. కెమెరాలు, డ్రోన్ లు సంచరించడంపై నిషేధం అమల్లో ఉంది.