MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ కౌకుంట్ల మండలాధ్యక్షుడు మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన అంగన్వాడీ భవన నిర్మాణం గ్రామ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.