MDK: రామాయపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం ఇరుముడి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 41 రోజులపాటు అయ్యప్ప స్వామి దీక్షను ఆచరించిన భక్తులు మండల దీక్ష పూర్తి కావడంతో ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిగీతాలు, భజన కీర్తనల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం సాగింది. అనంతరం భక్తులు శబరి యాత్రకు బయలుదేరి వెళ్లారు.