On the occasion of Sri Rama Navami, Surya Thilak will be formed on Ram Lalla's forehead in Ayodhya
Sri Rama Navami: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో ఓ అద్భుతం చోటు చేసుకోనుంది. రామ్ లల్లా విగ్రహంపై సూర్యతిలకం ఏర్పడనుంది. ఈరోజు మధ్యాహ్నం 12:15 నిమిషాలకు గర్భగుడిలో ఉన్న రాముడి నుదుటిపై సూర్య తిలకం ప్రసరించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా గుడి నిర్మాణం చేపట్టారు. దీన్ని సూర్యా అభిషేకంగా, సూర్య తిలకంగా అభివర్ణిస్తున్నారు. ఈ అద్భుతమైన దృష్యాన్ని కనులారా చూసేందుకు రామ భక్తులు లక్షల్లో తరలివచ్చారు. రామ మందిరం నిర్మించిన తరువాత మొదటి శ్రీరామ నవమి కావడంతో ఆలయనిర్వాకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుడి అవరణాలను అందంగా ముస్తాబు చేసింది. అలాగే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు వేసవి ఎండల దృష్ట్యా ఆలయ ఆవరణలో కార్పెట్లను పరిచారు.
చదవండి:Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 17th)..కోపాన్ని తగ్గించుకుంటే మంచిది
ప్రత్యేకంగా ఈ ఆలయంలో విగ్రహంపై సూర్యకాంతి ప్రసరించేలా నిర్యాణాన్ని చేపట్టారు. మొత్తం మందిరాన్ని మూడు అంతస్తులుగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఒకటో అంతస్తూ పూర్తి అయింది. మిగితా రెండు అంతస్తులు నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి. అయితే సూర్య తిలకం కోసం మూడో అంతస్తులో విదేశాల నుంచి తెప్పించిన అద్దాలను అమర్చారు. వాటిపై పడిని సూర్యకిరణాలు రెండో అంతస్తులో పడి అక్కడినుంచి గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం నుదిటిపై ప్రకాశిస్తాయి. సూర్యుడి గమనాన్ని, కిరణాలు ప్రసరించే కోణాన్ని బట్టి ఈ ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం శ్రీరామ నవమి రోజు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉంది.
చదవండి:PM Modi: శ్రీరామ నవమి శుభాకాంక్షలతో ప్రధాని మోడీ ఆసక్తికరమైన పోస్ట్

