ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూశారు. పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం ఆయన అలుపెరగని కృషి చేశారు. పర్యావరణ రక్షణలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా, 2024లో ఐక్యరాజ్యసమితి ప్రతిష్టాత్మక ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డుతో గౌరవించింది. గాడ్గిల్ కమిటీ నివేదిక ద్వారా ఆయన పశ్చిమ కనుమల ఆవరణ వ్యవస్థ ప్రాముఖ్యతను చాటిచెప్పారు.