ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) వేళ హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. వెంటనే తప్పు తెలుసుకుని ఆ ట్వీట్ ను డిలీట్ (Delete) చేయగా అప్పటికే నెటిజన్లు రాహుల్ పై మండిపడ్డారు. తాను చేసిన దానికి రాహుల్ క్షమాపణలు (Apologise) చెప్పాడు. ‘ఒట్టేసి చెబుతున్నా’ ‘క్షమించండి’ అని పలు ట్వీట్లు చేయడంతో నెటిజన్లు శాంతించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?
సైలెంట్ (Silent) అనే హాలీవుడ్ సినిమాలో హీరో బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసం (Stunt) వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. ఆయన ట్వీట్ చేయకముందే ఒడిశాలో (Odisha) రైలు ప్రమాదం సంభవించింది. వందల మంది మృతి చెందగా.. వేలాది మంది గాయపడ్డారు. ఈ సమయంలోనే ఆ ట్వీట్ చేయడంతో తీవ్ర వివాదం ఏర్పడింది. వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్ ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. అనంతరం మరో ట్వీట్ చేశాడు.
‘వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు. నా పనుల్లో బిజీగా (Busy) ఉండడంతో వార్తలు చూడలేదు. నా తప్పును గ్రహించి అప్రమత్తం చేసిన మీకు ధన్యవాదాలు. అభినందనలు’ అని రాహుల్ పోస్టు చేశాడు. కాగా, అప్పటికే ఆ పాత ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. దీనిపై నెటిజన్లు మండిపడడంతో వారికి వ్యక్తిగతంగా రిప్లయ్ ఇచ్చారు. ‘ఇంతకుముందు చేసిన ట్వీట్ పై క్షమించాలి. ఒట్టు వేసి చెబుతున్నా.. ఆ విషాద వార్త గురించి నాకు తెలియదు. నా పనిలో బిజీ వలన వార్తలు చూడలేదు. అందుకే తప్పు జరిగింది. క్షమించమని కోరుతున్నా’ అని రాహుల్ బదులిచ్చారు. దీంతో నెటిజన్లు చల్లబడ్డారు. ఈ వరుస ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.