»Govt Of India Bans 14 Fixed Dose Medicines For Likely Posing Risks To Health
Medicines Ban మరో 14 రకాల మందులు నిషేధం.. ఎందుకో తెలుసా?
ఫిక్స్ డ్ కాంబినేషన్ అంటే.. రెండు లేదా అంతకుమించి యాక్టివ్ ఇంగ్రేడియెంట్స్ (కాంపౌండ్స్) కలయిక. డోసేజ్ కూడా ఫిక్స్ డ్ గా ఉంటుంది. అధిక శాతం ప్రజల ప్రయోజనం రీత్యా వీటి తయారీ, విక్రయాలు, పంపిణీని నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కొన్ని రకాల మందులను (Medicines) భారత ప్రభుత్వం (Govt of India) నిషేధించింది. ఆరోగ్యానికి హాని కలిగించే 14 రకాల ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ (fixed-dose combination -FDC) ఔషధాలను నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. చికిత్సపరంగా శాస్త్రీయత లేదంటూ వాటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిషేధించిన మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ కాంబినేషన్ అంటే.. రెండు లేదా అంతకుమించి యాక్టివ్ ఇంగ్రేడియెంట్స్ (కాంపౌండ్స్) కలయిక. డోసేజ్ (Dosage) కూడా ఫిక్స్ డ్ గా ఉంటుంది. అధిక శాతం ప్రజల ప్రయోజనం రీత్యా వీటి తయారీ, విక్రయాలు, పంపిణీని నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా నిషేధించిన మందులు ఇవే..