»Govt Of India Plans To Telangana Decade Celebrations In Golconda Fort
StateHood కేంద్ర ప్రభుత్వంలో కదలిక.. తొలిసారి తెలంగాణ అవతరణ ఉత్సవాలు
తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయినా నిర్వహించని కేంద్రం ఇప్పుడు అకస్మాత్తుగా ఉత్సవాలు నిర్వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో కేంద్రం కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
పోరాడి సాధించుకున్న తెలంగాణ (Telangana).. అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు సాధిస్తోంది. ఆవిర్భావానికి ముందు తర్వాత తెలంగాణ దశదిశ మారిపోయింది. దేశంలోనే ప్రత్యేకత చాటుతూ రాష్ట్రం దూసుకుపోతుంది. రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా 21వ రోజుల పాటు శతాబ్ది ఉత్సవాలు (Telangana Decade Celebrations) జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ (KCR) ఈ మేరకు ఆదేశాలు, కార్యాచరణ, నిధుల విడుదల చేశారు. అయితే వీటికి పోటీగా కేంద్ర ప్రభుత్వం (Govt of India) కూడా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తోంది. ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం ఇదే డిమాండ్ చేస్తుండగా ప్రస్తుతం ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
రాష్ట్ర ప్రభుత్వానికి కన్నా దీటుగా తెలంగాణ అవతరణ ఉత్సవాలు (Celebrations) నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. జూన్ 2వ తేదీన గోల్కొండ కోటలో (Golconda Fort) కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు కేంద్ర భద్రతా దళాలతో కవాతు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Activities) పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. కాగా ఈ ఉత్సవాలకు పలువురు కేంద్ర మంత్రులు రానున్నారని సమాచారం. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా(Official) నిర్వహిస్తోంది. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయినా నిర్వహించని కేంద్రం ఇప్పుడు అకస్మాత్తుగా ఉత్సవాలు నిర్వహించడం విస్మయానికి (Shocking) గురి చేస్తోంది. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో కేంద్రం కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పార్టీపై విమర్శలు రాకుండా ఈ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.