»Dd Colony Wife Commits Suicide After Demise Of Husband In Hyderabad
Hyderabadలో విషాదం.. గుండెపోటుతో భర్త మృతిని తట్టుకోలేక భార్య..
తీవ్ర విషాదంలో ఉన్న ఆమె ఎవరితో సక్రమంగా మాట్లాడడం లేదు. ఆమె పరిస్థితి చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అందుకే ఆమె వెన్నంటే అందరూ ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి నిద్రపోయిన ఆమె తెల్లవారుజామున ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనతో కుటుంబీకులు హతాశయులయ్యారు.
పెళ్లయ్యి (Marriage) ఏడాది దాటింది. అమెరికాలో (US) మంచిగా ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజుల వ్యవధిలో ఆ కుటుంబం (Family) తీవ్ర విషాదంలో మునిగింది. అకస్మాత్తుగా గుండెపోటుతో (Heart Attack) భర్త మరణించగా.. అతడి మృతిని భార్య (Wife) తట్టుకోలేకపోయింది. భర్త లేని జీవితం వద్దని భావించి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ (Hyderabad)లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని డీడీ కాలనీకి (DD Colony) చెందిన సాహితీ (29)కి వనస్థలిపురం (Vanasthalipuram) ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Software Engineer) మనోజ్ తో గతేడాది వివాహం జరిపించారు. పెళ్లి అనంతరం వీరిద్దరూ అమెరికాకు వెళ్లిపోయి అక్కడే నివసిస్తున్నారు. ఇద్దరు ఉద్యోగం (Job) చేస్తూ హాయిగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు భార్య సాహితీ ఈనెల 2వ తేదీన హైదరాబాద్ వచ్చింది. అయితే ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న భర్త మనోజ్ (Manoj) గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు. తాను ఇటు రాగానే.. అటు భర్త కన్నుమూయడంతో ఆమె తట్టుకోలేకపోయింది.
భర్త మృతి చెందినప్పటి నుంచి సాహితీ దిగ్భ్రాంతికి లోనైంది. ఈనెల 23న మనోజ్ మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. అచేతనంగా ఉన్న మనోజ్ ను చూసి సాహితీ (Sahithi) గుండెలవిసేలా రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అనంతరం వనస్థలిపురంలో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. లాంఛనాలు పూర్తయ్యాక మళ్లీ సాహితీ తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.
తీవ్ర విషాదంలో ఉన్న సాహితీ ఎవరితో సక్రమంగా మాట్లాడడం లేదు. ఆమె పరిస్థితి చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అందుకే ఆమె వెన్నంటే అందరూ ఉన్నారు. బుధవారం కుటుంబసభ్యులతో కలిసి నిద్రపోయిన సాహితీ గురువారం తెల్లవారుజామున ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనతో కుటుంబీకులు హతాశయులయ్యారు. వాష్ రూమ్ కోసం పది నిమిషాలు బయటకు వెళ్లివచ్చేలోపు అక్క ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని సాహితీ చెల్లెలు రోదిస్తూ చెప్పింది. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మనోజ్, సాహితీ అన్యోన్యంగా ఉండేవారని కుటుంబీకులు చెబుతున్నారు. భర్త మరణాన్ని తట్టుకోలేక సాహితీ ఈ చర్యకు పాల్పడిందని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆమె అంత్యక్రియలు కుటుంబసభ్యులు జరిపించారు. రోజుల వ్యవధిలోనే ఇద్దరినీ కోల్పోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి.