»Private Bus Overturns In Madanapalle 63 People Escaped In Accident
Major Accident అన్నమయ్య జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. 63 మందికి గాయాలు
అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 56 మందికి స్వల్ప గాయాలవగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
ఏపీలో త్రుటిలో పెను ప్రమాదం (Major Accident) తప్పింది. అదుపు తప్పి కారును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు (Private Bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 63 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో (Annamayya District) చోటుచేసుకుంది.
బెంగళూరు (Bengaluru) నుంచి తిరుపతికి (Tirupati) వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో (Madanapalle) ప్రమాదానికి గురైంది. కూకుటిమానగడ్డ సమీపంలోకి రాగానే కారును (Car) వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 56 మందికి స్వల్ప గాయాలవగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రికి (Govt Hospital) తరలించారు. తీవ్ర గాయాపాలైన వారిని తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
సంఘటనా స్థలాన్ని మదనపల్లె ఆర్డీఓ మురళి, డీఎస్పీ శేషప్ప పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు (Cause) తెలుసుకున్నారు. అతివేగంగా రావడం.. బ్రేక్ (Break) వేసినా బస్సు అదుపు (Control) కాకపోవడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ప్రమాదంలో అందరూ క్షేమంగా (Safe) బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.